బొప్పాయి ఆకు విశేషమైన ఔషధ గుణాలని కలిగి ఉంది. ముఖ్యంగా ఇది కాలేయం, మూత్రపిండాలు మరియు గుండె జబ్బులకు ఉపయోగకరంగా ఉంటుంది.

బొప్పాయి ఆకు కాలేయ పనితీరుకు విపరీతంగా తోడ్పడుతుంది. మలినాలని డిటాక్సిఫై చేసి మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

బొప్పాయి ఆకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ వడపోతలో సహాయపడుతుంది.

బొప్పాయి ఆకులో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఫైబర్ ఉంటుంది.  ఇది శరీరంలోనూ, అలాగే రక్తంలోనూ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు రాకుండా మివారించ బడతాయి.

బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

బొప్పాయి ఆకులోని రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు శరీరం యొక్క రక్షణ విధానాలను బలోపేతం చేస్తాయి, వివిధ వ్యాధుల నివారణలో సహాయపడతాయి.

బొప్పాయి ఆకులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ కంటెంట్‌ ప్రోటీన్లని విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ విధంగా ఇది జీర్ణశయాంతర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

డెంగ్యూ వంటి వ్యాధుల వలన బ్లడ్ లో ప్లేట్‌లెట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకు రసం సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ లో ఉండే ప్లేట్‌లెట్ కౌంట్ ని పెంచుతుంది. ఇంకా రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. 

బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాలు క్యాన్సర్ నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి కణితి పెరుగుదలను నిరోధించడంతో పాటు క్యాన్సర్ పెరుగుదలను కూడా నియంత్రిస్తాయి.

బొప్పాయిలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెరుగైన కంటి చూపు కోసం ఈ బొప్పాయి ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకొంటే ఫలితం ఉంటుంది.