ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది

పండ్ల తొక్కల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది.

యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి 

పండ్ల తొక్కల్లో యాంటీఆక్సిడెంట్‌ల మోతాదు అధికంగా ఉంటుంది. ఇవి సెల్ డ్యామేజ్‌ను తగ్గించి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి 

లెమన్, ఆపిల్ తొక్కలు చర్మం మీద రుద్దితే ప్రకాశవంతమైన గ్లో వస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. 

చక్కెర నియంత్రణలో సహాయపడతాయి  

పండ్ల తొక్కలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. 

బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి  

ఫైబర్ అధికంగా ఉండటంతో, పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తాయి. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గి బరువు తగ్గుతారు. 

హార్ట్ హెల్త్‌కి మేలు చేస్తాయి  

పండ్ల తొక్కల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు హార్ట్ హెల్త్ ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. 

ఇమ్యూనిటీ పెరుగుతుంది  

పండ్ల తొక్కల్లో విటమిన్‌ సి వంటి పోషకాలతో రోగ నిరోధక శక్తి బలపడుతుంది. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది. 

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది 

తొక్కల్లో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు సెల్ మ్యూటేషన్‌ను అడ్డుకుంటాయి. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం తక్కువవుతుంది.

జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి  

పండ్ల తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. టాక్సిన్లు తొలగించబడతాయి.

సహజంగా డీటాక్స్  

పండ్ల తొక్కలు సహజ డీటాక్స్ గా పనిచేస్తాయి. శరీరంలో నుండి విషపదార్థాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి.