నేచురల్ డిటాక్సిఫైయర్
బీట్‌రూట్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు కిడ్నీలలో ఉండే టాక్సిన్లు తొలగించడంలో సహాయపడతాయి.
రక్త ప్రసరణ పెంపు
నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
బ్లడ్ ప్రెజర్ కంట్రోల్
బీట్‌రూట్ రక్త ప్రసరణని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల కిడ్నీపై వచ్చే ఒత్తిడి తగ్గుతుంది.
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్‌ను పరిమితంగా తినాలి, లేకపోతే కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఆక్సలేట్ ఎక్కువ
బీట్‌రూట్‌లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొందరిలో కిడ్నీ స్టోన్‌లను పెంచే అవకాశం ఉంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు
బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా శరీరంలో వచ్చే వాపుని తగ్గించి కిడ్నీలకు రక్షణ కలిగిస్తుంది.
ఫిల్టరింగ్ సామర్ధ్యం
బీట్‌రూట్‌లోని బీటాలైన్స్ కిడ్నీ టిష్యూలను శుభ్రంగా ఉంచుతాయి. అందువల్ల కిడ్న ఫిల్టరింగ్ పెరుగుతుంది.
డయాబెటిక్‌లకు పరిమితం
బీట్‌రూట్‌లో నేచురల్ షుగర్ ఉంటుంది, కాబట్టి కిడ్నీ సమస్యలతో ఉన్న డయాబెటిక్‌లు పరిమితంగా తీసుకోవాలి.
నీటితో కలిపి తీసుకోవడం
బీట్‌రూట్ జ్యూస్‌ను నీటితో కలిపి తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది.
బ్యాలెన్స్డ్ డైట్ లో భాగం
రోజూ మీ డైట్ లో మితంగా బీట్‌రూట్ చేర్చడం వల్ల అది మీ కిడ్నీ ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుతుంది.