రక్త శుద్ధి
బీట్‌రూట్‌లో ఉండే ఐరన్, కాపర్ లు రక్తాన్ని శుద్ధి చేసి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి.
చర్మం కాంతివంతం
క్యారెట్‌లో ఉన్న బీటా-క్యారోటీన్, బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతం చేసి నేచురల్ గ్లోని ఇస్తాయి.
రక్తపోటు నియంత్రణ
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను విస్తరింప చేయటం వల్ల రక్తసరఫరా పెరిగి రక్తపోటు తగ్గుతుంది.
కంటి చూపు మెరుగు
క్యారెట్‌లో ఉన్న విటమిన్ A కంటి చూపును బలపరుస్తుంది, అందువల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు తగ్గుతాయి.
లివర్ క్లీన్
బీట్‌రూట్‌లోని బీటైన్ లివర్‌ను శుభ్రం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇంకా శరీర శక్తిని పెంచుతుంది.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ
వీటిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డైజేషన్ ఫ్రీ
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, ఫలితంగా మలబద్ధకం తగ్గుతుంది.
హార్ట్ హెల్త్
ఈ జ్యూస్ తాగటం వల్ల రక్త ప్రసరణ పెరిగి, హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి.
వెయిట్ లాస్
క్యారెట్ మరియు బీట్ రూట్ లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల ఈ జ్యూస్ ని డైట్‌లో భాగంగా తీసుకోవచ్చు.
బ్రెయిన్ పవర్
బీట్‌రూట్‌లోని నైట్రిక్ ఆక్సైడ్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాని పెంచి, మెమరీని బూస్ట్ చేస్తుంది