కోకోనట్ వాటర్

నేచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేసే కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్ తో నిండిపోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గించి, శరీరాన్ని సహజంగా కూల్ చేస్తుంది.

ఆలోవెరా జ్యూస్  

ఆలోవెరా జెల్‌ని జ్యూస్ రూపంలో తాగితే శరీరంలో వేడి తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.  

బటర్ మిల్క్ 

పులిసిన పెరుగు నుంచి చేసిన మజ్జిగ వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. మజ్జిగలో జీలకర్ర లేదా అల్లం కలిపి తాగితే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.  

ఆమ్లా జ్యూస్ 

ఉసిరికాయ శరీరాన్ని శుద్ధి చేసే నేచురల్ కూలెంట్‌లా పనిచేస్తుంది. రోజూ ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి వేడి వల్ల వచ్చే చర్మ సమస్యలు తగ్గుతాయి.

కోరియాండర్ జ్యూస్  

కొత్తిమీర విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలో వేడి తగ్గిపోతుంది. ఇది కిడ్నీ పనితీరును బాగు చేస్తూ, యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది.  

ఫెన్నెల్ సీడ్స్ వాటర్ 

సొంపు గింజలు సహజమైన శీతల గుణాలు కలిగినవి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీరు తాగితే కళ్ళకు చల్లదనం, శరీరానికి శక్తి వస్తుంది.  

బేసిల్ వాటర్ 

తులసి ఆకులను మరిగించి తయారు చేసే డ్రింక్ శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

చియా సీడ్స్ డ్రింక్ 

సబ్జా గింజలు నీటిలో ఉబ్బించుకుని తీసుకుంటే వెంటనే శరీరానికి చల్లదనం ఇస్తాయి. ఇవి కడుపు సమస్యలు, మలబద్ధకం తగ్గించడంలో కూడా సహాయపడతాయి.  

బిట్టర్ గార్డ్ జ్యూస్ 

కాకరకాయ చేదుగా ఉన్నా, జ్యూస్ రూపంలో తీసుకుంటే కాలేయానికి శుభ్రత ఇస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలో వేడి కారణంగా వచ్చే పింపుల్స్, బాయిల్స్ తగ్గిస్తుంది.

మింట్ జ్యూస్  

పుదీనా ఆకులను మరిగించి తాగితే శరీరానికి వెంటనే చల్లదనం కలుగుతుంది. ఇది డైజెషన్ బాగు చేసి, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది.