రాత్రిపూట ఐస్‌క్రీమ్‌ని తినడం ఒక హ్యాపీ ట్రీట్‌గా భావిస్తుంటాం. అయితే ఈ అలవాటు నిద్రకి  భంగం కలిగిస్తుంటుందని మీకు తెలుసా!

బెడ్ టైమ్ కి ముందు ఐస్ క్రీం తినటం వల్ల అజీర్ణం లేదా గుండెల్లో మంట వంటివి ఏర్పడవచ్చు. ఇది శరీర  విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. 

ఒక్క ఐస్ క్రీం మాత్రమే కాదు, వీలైనంత వరకూ నిద్రకి ముందు ఎలాంటి డైరీ ప్రొడక్ట్స్ ని వాడకపోవటమే బెటర్. ఎందుకంటే ఇవి, మీ డైజెస్టివ్ సిస్టం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి.

ఐస్ క్రీంలో కేలరీస్ ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట దీనిని ఎక్కువగా తింటే… కాలక్రమేణా అది వెయిట్ గెయిన్ అవడానికి దోహదం చేస్తుంది.

ఐస్ క్రీంలో షుగర్ కంటెంట్ ఎక్కువ. నిద్రకు ముందు సరదాగా దానిని తీసుకున్నప్పటికీ అది మీ శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగించవచ్చు. 

లేట్ నైట్ డిన్నర్ తర్వాత ఐస్ క్రీం తింటే ఆ శాటిస్ఫాక్షనే వేరు అని అనుకోవచ్చు. కానీ దానంత డేంజర్ మరొకటి లేదనే విషయం గుర్తుంచుకోండి.

నిద్రకు ముందు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకొంటే మంచిది. అందుకోసం వీలైనంత వరకూ మీ ఐస్‌క్రీమ్‌ హాబీని ఈవెనింగ్ వరకే పరిమితం చేయండి. 

నిద్రకు ముందు ఐస్‌క్రీమ్‌ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా హార్మోన్ ఇమ్బ్యాలెన్స్ కి దారితీస్తుంది.

ఐస్‌క్రీమ్‌ లో ఉండే షుగర్ కంటెంట్ వల్ల మీ నిద్రకి భంగం ఏర్పడుతుంది. అదే రాను రాను నిద్ర లేమికి దారి తీస్తుంది. 

హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీ లేట్-నైట్ స్నాక్ లో ఐస్ క్రీమ్ ని మాత్రం ఎవాయిడ్ చేయండి.