ఆటోమేటెడ్ డయాగ్నోసిస్ 

AI ఆధారిత అల్గారిథమ్‌లు రక్తపరీక్షలు, MRI స్కాన్లు నిమిషాల్లోనే యాక్యురేట్ డయాగ్నోసిస్ ని అందిస్తాయి. ఇది డాక్టర్ల పనిభారం తగ్గించి, ట్రీట్మెంట్ ని  వేగవంతం చేస్తుంది.

పర్సనల్ హీలింగ్ 

AI పేషెంట్ జెనెటిక్ డేటా, మెడికల్ హిస్టరీ విశ్లేషణ ద్వారా పర్సనల్ థెరపీని సూచిస్తుంది. దీని వల్ల మెడికేషన్ ఇంప్రూవ్ అవుతుంది.సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.

ఆటోమేటెడ్ సర్జరీలు  

రోబోటిక్ సర్జరీ AI సహాయంతో జరగడం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది. ఇది ఆపరేషన్ సమయంలో పొరపాట్లను తగ్గించి, వేగంగా కోలుకునే అవకాశం కల్పిస్తుంది. 

హెల్త్ ఎడ్వైజ్ చాట్‌బోట్స్  

AI ఆధారిత చాట్‌బోట్స్ బేసిక్ హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. ఇది చిన్న సమస్యలకు హాస్పిటల్ వెళ్లకుండా, ఇంట్లోనే పరిష్కారం పొందేలా సహాయపడుతుంది. 

డ్రగ్ రీసర్చ్ వేగవంతం  

AI పెద్ద డేటాబేస్‌లను ఎనలైజ్ చేసి, డ్రగ్ ఇన్నోవేషన్ ని వేగవంతం చేస్తుంది. ఇది కొత్త వ్యాధులకి ట్రీట్మెంట్ త్వరగా చేయడంలో సహాయపడుతుంది.  

హెల్త్ డేటా ఎనాలసిస్

AI బిలియన్ల సంఖ్యలో హెల్త్ రికార్డులను ఎనలైజ్ చేసి, రోగాలపై సరైన అంచనాలు చేస్తుంది. దీని ద్వారా వ్యాధుల వ్యాప్తిని ముందుగా గుర్తించి నివారించవచ్చు.

హెల్త్ కేర్ అబ్జర్వేషన్  

మానిటరింగ్ డివైజెస్ AI సహాయంతో పేషంట్ హెల్త్ కండిషన్ ని నిరంతరం గమనిస్తాయి. ఇది హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ని ముందుగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. 

క్యాన్సర్ డిటెక్షన్‌లో AI  

AI ఆధారిత స్కానింగ్ టెక్నాలజీలు క్యాన్సర్‌ను బేసిక్ స్టేజ్ లోనే గుర్తిస్తాయి. దీంతో సరైన సమయానికి చికిత్స అందించి, రోగిని బతికించే అవకాశాన్ని పెంచుతుంది.  

మెడికల్ ట్రైనింగ్‌లో AI  

మెడికల్ స్టూడెంట్స్ కి AI బేస్డ్ వర్చువల్ ట్రైనింగ్ బెటర్ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తుంది. ఇది మెడికల్ స్కిల్స్ ని పెంచి, వారికి క్లినికల్ అనుభవాన్ని అందిస్తుంది.

స్మార్ట్ హాస్పిటల్స్  

AI సహాయంతో ఆసుపత్రుల్లో ఆటోమేటెడ్ మెషిన్స్, పేషెంట్ డేటా మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్ అవ్వడం, క్విక్ గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలగటం ఇలా మెడికల్ ఫీల్డ్ మొత్తాన్ని మార్చివేస్తుంది.