శీతాకాలంలో చల్లని వాతావరణం కీళ్ల కదలికను తగ్గిస్తుంది, రక్తప్రసరణ మందగించి నొప్పి, గట్టితనం ఎక్కువగా అనిపిస్తుంది.

ఉదయం లేవగానే నెమ్మదిగా చేతులు, కాళ్లు స్ట్రెచ్ చేయడం వాళ్ళ కీళ్లకు తగ్గిన రాపిడి జరిగి రోజంతా సౌకర్యంగా కదలడానికి సహాయపడుతుంది.

మెడ మరియు భుజాల సున్నితమైన రొటేషన్ వ్యాయామాలు కండరాల గట్టితనాన్ని తగ్గించి తలనొప్పి, భుజంనొప్పి తగ్గించడంలో ఉపయోగపడతాయి. 

మోకాళ్ల కోసం సీటెడ్ లెగ్ ఎక్స్‌టెన్షన్ స్ట్రెచ్ చేయడం కీళ్ల చలనం మెరుగుపరచి వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది 

మడమల సర్కిల్ స్ట్రెచింగ్ రక్తప్రసరణ పెంచి కాళ్ల గట్టితనాన్ని తగ్గించి శీతాకాలంలో నడకలో సౌకర్యం అందిస్తుంది.

హామ్‌స్ట్రింగ్ సున్నితమైన స్ట్రెచ్ వెనుక కాళ్ల కండరాలను సడలించి దిగువ వెన్నునొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

హిప్ ఓపెనర్ స్ట్రెచ్ నడుము, తొడ కండరాలను రిలాక్స్ చేసి శీతాకాలంలో వచ్చే కీళ్ల ఒత్తిడిని తగ్గిస్తుంది 

ప్రతి స్ట్రెచ్ కనీసం ఇరవై నుండి ముప్పై సెకన్లపాటైనా చేయాలి. ఆ సమయంలో  నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేయాలి.

స్ట్రెచింగ్ ముందు వేడి నీటితో తేలికపాటి స్నానం చేయటం లేదా హాట్ ప్యాక్ ఉపయోగించటం వంటివి చేస్తే కీళ్ల కదలిక మెరుగుపడుతుంది.

శీతాకాలంలో సాదారణంగా వచ్చే ఈ కీళ్ళనొప్పిని కేర్లెస్ చేయకండి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి.