రోజూ రెండు నిమిషాల పాటు ఏదైనా కాంతి వైపు మనస్సును కేంద్రీకరించడం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవటం. ఈ మెడిటేషన్ వల్ల కంటి పటుత్వం పెరుగుతుంది. దృష్టి బలంగా మారుతుంది.
రెండు అరచేతులు బాగా రుద్దుకొని వేడిగా చేసి కళ్లపై ఉంచితే కళ్లకి విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల కంటి నరాలు రిలాక్స్ అవుతాయి. ఇది కంటికి మంచి వ్యాయామం.
ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరం చూస్తూ 20 సెకన్లు విశ్రాంతి ఇవ్వాలి. కంటి ఒత్తిడిని తగ్గించే ఈ సూత్రం కళ్లద్దాలు తొలగించడానికీ సహాయం చేస్తుంది.
కళ్లను గడియార దిశలో, వెనక దిశలో తిప్పడం వల్ల కంటి కండరాలు శక్తివంతంగా మారతాయి. ఇది కళ్లకి మంచి వ్యాయామంగా ఉపయోగపడుతుంది.
వేడి చేతులతో నుదిటిపై మర్దన చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది కంటికి రిలీఫ్ ఇస్తుంది. కనురెప్పల మీద కూడా నెమ్మదిగా మర్దించాలి.
గులాబీ నీటిని కళ్లలో వేసుకోవడం ద్వారా కంటి వాపు, దుమ్ము తగ్గుతాయి. ఇది సహజ కంటి శుద్ధి పద్ధతి. రోజూ ఒకసారి ఉపయోగించవచ్చు.
కీరాలో నీరు అధికంగా ఉంటుంది. ఇది కంటి తేమను కాపాడుతుంది. అలాగే నచ్చినపుడు కళ్లపై ఉంచితే కూడా చల్లదనాన్ని ఇస్తుంది.
వాల్‌నట్స్, అవకాడో, ఫ్లాక్ సీడ్స్ లాంటివి కంటికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం కంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
రోజుకి కనీసం 7-8 గంటలు నిద్ర పడితేనే కంటి క్షీణత తగ్గుతుంది. తక్కువ నిద్ర వల్ల కంటి బలహీనత వస్తుంది.
ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా చూడడం వల్ల కంటి మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం 2 గంటలు వాటి నుండి దూరంగా ఉండాలి.