పగలు vs రాత్రి: మీ చర్మం మెరిసిపోవాలంటే ఎప్పుడు ఏం వాడాలి?

చాలామందికి తెలియని స్కిన్ కేర్ రహస్యాలు.. డాక్టర్లు ఏం సలహా ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం!  

పగటిపూట సూర్యకాంతి, కాలుష్యం నుండి ప్రొటెక్ట్ చేయటం కోసం స్కిన్ కి లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉపయోగించాలి.

ఉదయం పేస్ క్లీన్ చేసేందుకు మైల్డ్ క్లీన్సర్ వాడాలి, ఇది స్కిన్ పై పేరుకున్న ఆయిల్, మలినాలు తొలగించి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.

ఉదయం స్కిన్ కేర్ లో విటమిన్ సీ సీరమ్ ఉపయోగించడం మంచిది, ఇది చర్మాన్ని బ్రైట్ గా ఉంచి ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది.

ఉదయం మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి, ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్ గా ఉంచుతుంది, మేకప్ కూడా స్మూత్ గా సెట్ అవుతుంది.

ఉదయం స్కిన్ కేర్ లో సన్ స్క్రీన్ అత్యంత ముఖ్యమైనది, SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది ప్రతిరోజూ తప్పకుండా ఉపయోగించాలి.

రాత్రి స్కిన్ కేర్ మేజర్ గా రిపేర్, రీజనరేషన్ పై ఫోకస్ చేస్తుంది, రోజు మొత్తం డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి సెట్ చేస్తుంది.

రాత్రి మేకప్, డస్ట్ పూర్తిగా రిమూవ్ చేసేందుకు డబుల్ క్లీన్సింగ్ చేయడం మంచిది, ఆయిల్ క్లీన్సర్ తర్వాత ఫోమ్ క్లీన్సర్ వాడాలి.

రాత్రి స్కిన్ కేర్ లో రెటినాల్ లేదా నయాసినమైడ్ వంటి యాక్టివ్ పదార్థాలు వాడటం చర్మం రీపేర్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది.

రాత్రి హెవీ మాయిశ్చరైజర్ వాడటం ద్వారా చర్మం డీప్ గా హైడ్రేట్ అవుతుంది, ఇది నిద్ర సమయంలో రిపేర్ ప్రాసెస్ యాక్సలరేట్ చేస్తుంది

రాత్రి కళ్ల చుట్టూ ప్రత్యేకమైన ఐ క్రీమ్ వాడటం వల్ల డార్క్ సర్కిల్స్, పఫ్‌నెస్ తగ్గించడంలో సహాయపడుతుంది

ఉదయం మరియు రాత్రి స్కిన్ కేర్ లో ప్రొడక్ట్స్  మార్చుకోవడం చాలా ముఖ్యం, ఒకే ప్రోడక్ట్స్ వాడితే రిజల్ట్  అంతగా కనిపించదు.

స్కిన్ టైప్ ప్రకారం రొటీన్ మార్చుకోవాలి, ఆయిలీ, డ్రై, కాంబినేషన్ చర్మానికి వేర్వేరు రకాల ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి.

హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడటం కన్నా సరైన ప్రొడక్ట్స్  వాడటం మంచిది, లేదంటే స్కిన్ ఇర్రిటేట్ అవ్వచ్చు.

డెర్మటాలజిస్ట్ సలహా తీసుకుని మీ స్కిన్ కి సరైన రొటీన్ ఫాలో అవ్వడం ద్వారా హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ ఈజీగా పొందవచ్చు.