నిద్రలోకి జారుతున్నప్పుడు ఒక్కసారిగా శరీరం జర్క్ అవ్వడం చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది ఇది సహజమైన మెదడు స్పందన మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు
ఈ పరిస్థితిని హిప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని పిలుస్తారు ఇది నిద్ర మొదటి దశలో జరుగుతుంది ఇది పూర్తిగా నార్మల్ రియాక్షన్
మన మెదడు నిద్రలోకి వెళ్లేటప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి ఆ సమయంలో మెదడు దీనిని పడిపోతున్నట్టు పొరపాటుగా అర్థం చేసుకుంటుంది వెంటనే స్పందిస్తుంది
దీంతో మెదడు శరీరాన్ని ఒక్కసారిగా కుదిపి మళ్లీ అలర్ట్ చేస్తుంది ఇది మనల్ని ప్రమాదం నుంచి కాపాడటానికి
ఓ డిఫెన్స్ మేకానిజం లాగా పనిచేస్తుంది \
ఈ జర్క్ సమయంలో కొంతమందికి ఎత్తు నుంచి పడుతున్నట్టు ఫీలింగ్ లేదా షాక్ లాంటి అనుభూతి కలుగుతుంది ఇది మెదడు సిగ్నల్స్ కారణంగా జరుగుతుంది
స్ట్రెస్, ఆందోళన, కాఫీలు ఎక్కువగా తాగడం వంటి కారణాలు ఈ హిప్నిక్ జర్క్ ను మరింత ఎక్కువగా కలిగిస్తాయి కాబట్టి జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తుంది
స్లీపింగ్ అవర్స్ ఇర్రెగ్యులర్ గా ఉండటం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ ఉంటే ఈ జర్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది
శరీరం అలసిపోయి ఉన్నప్పుడు లేదా వర్కౌట్లు ఎక్కువగా చేసినప్పుడు కూడా ఈ జర్క్స్ ఎక్కువగా అనిపించవచ్చు ఇది మసిల్స్ రియాక్షన్ మాత్రమే
ఈ సమయంలో గుండె వేగం కాస్త పెరగడం లేదా శ్వాస వేగంగా మారడం సాధారణమే ఇది భయపడాల్సిన విషయం కాదు సహజమైన ప్రతిస్పందన అంతే…
ప్రతి ఒక్కరికీ ఇది ఒకే విధంగా అనిపించదు కొందరికి చిన్న జర్క్ లాగా ఉంటే మరికొందరికి బలమైన షాక్ లాగా అనిపిస్తుంది
నిద్రలోకి వెళ్లే ముందు ఫోన్ లేదా స్క్రీన్ ఎక్కువగా వాడటం మెదడును యాక్టివ్ గా ఉంచి ఈ జర్క్స్ ను పెంచే అవకాశం ఉంటుంది
కెఫీన్, నికోటిన్ వంటి స్టిములెంట్స్ మెదడును ఉత్తేజపరుస్తాయి కాబట్టి నిద్రకు ముందు ఇవి తీసుకోవడం తగ్గిస్తే మంచిది
ధ్యానం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయడం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచవచ్చు దీంతో హిప్నిక్ జర్క్ తీవ్రత తగ్గుతుంది
అయితే ఈ జర్క్స్ చాలా తరచుగా లేదా తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది ఎందుకంటే ఇది ఇతర సమస్యలకు సంకేతం కావచ్చు
మొత్తానికి ఇది మన శరీరం మరియు మెదడు మధ్య జరిగే సహజ కమ్యూనికేషన్ మాత్రమే కాబట్టి భయపడకుండా సరైన నిద్ర అలవాట్లు పాటిస్తే సరిపోతుంది