కేవలం నీళ్లు మాత్రమే తాగితే మీ శరీరం నిజంగా డిటాక్స్ అవుతుందా… లేక ప్రమాదంలో పడుతుందా? ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వాటర్ ఫాస్టింగ్ ట్రెండ్ ఏంటి?

చాలామంది దీనిని  డిటాక్స్ కోసం చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ మన శరీరం ఇప్పటికే లివర్, కిడ్నీల ద్వారా టాక్సిన్స్‌ను నేచురల్ గా బయటకు పంపుతుంది

వాటర్ ఫాస్టింగ్ వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందకుండా పోయి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇది చాలా ప్రమాదకరం

మొదటి కొన్ని రోజుల్లో బరువు తగ్గినట్లు కనిపిస్తుంది కానీ ఇది నిజమైన ఫ్యాట్ లాస్ కాదు, కేవలం బాడీలో వాటర్ అండ్  మజిల్ లాస్ మాత్రమే.

వాటర్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు చేస్తే బాడీ ఎనర్జీ కోసం మజిల్స్‌ను బ్రేక్ చేయడం ప్రారంభిస్తుంది ఇది శరీర బలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

లో బ్లడ్ షుగర్ వల్ల తలతిరగడం, అలసట, బలహీనత, కళ్ళు చీకట్లు కమ్మడం వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి.

హార్ట్ బీట్ ఇమ్బ్యాలెన్స్ అవ్వడం, ఎలక్ట్రోలైట్ ఇమ్బ్యాలెన్స్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా వాటర్ ఫాస్టింగ్ వల్ల రావచ్చు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది.

ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్లు కూడా పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరం త్వరగా వీకవుతుంది.

బ్రెయిన్‌కు గ్లూకోజ్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఫాస్టింగ్ వల్ల ఫోకస్ తగ్గడం, కన్‌ఫ్యూజన్, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి.

వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి డీహైడ్రేషన్ కూడా సంభవించవచ్చు. ఎందుకంటే సరైన ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వల్ల శరీరం నీటిని నిల్వ ఉంచలేకపోతుంది.

కొంతమంది దీన్ని క్లెన్స్ అని భావిస్తారు కానీ సైన్స్ ప్రకారం శరీరానికి ప్రత్యేక డిటాక్స్ అవసరం లేదు, ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే.

వాటర్ ఫాస్టింగ్ తర్వాత మళ్లీ సాధారణంగా తినడం మొదలుపెడితే రాపిడ్ వెయిట్ గైన్ జరుగుతుంది ఇది యో-యో ఎఫెక్ట్‌కు దారి తీస్తుంది.

డయాబెటిస్, బీపీ, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వాటర్ ఫాస్టింగ్ మరింత ప్రమాదకరం డాక్టర్ సలహా లేకుండా చేయడం తప్పు.

సేఫ్‌గా వెయిట్ లాస్ లేదా డిటాక్స్ కావాలంటే బ్యాలెన్స్‌డ్ డైట్, సరైన నిద్ర, రెగ్యులర్ వ్యాయామం మాత్రమే ఉత్తమ మార్గాలు.

ట్రెండ్ అనిపించిందని వెంటనే ఫాలో అవ్వకుండా, మీ ఆరోగ్యం గురించి ఆలోచించి సరైన సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.