పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం లివర్‌కి డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీలైనంత తక్కువగా వాటిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.

పారాసెటమాల్ వంటి సాధారణ మందులు కూడా హై డోసేజ్ లో తీసుకుంటే లివర్ పై ఒత్తిడి పెరిగి తీవ్రమైన డ్యామేజ్ కలిగించే ప్రమాదం ఉంటుంది.

డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్ వాడటం వల్ల లివర్ పనితీరును దెబ్బతీసి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జిమ్ సప్లిమెంట్స్ లేదా బాడీ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లో ఉన్న కెమికల్స్ లివర్‌ను నెమ్మదిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని స్టడీస్ నిరూపిస్తున్నాయి.

హెర్బల్ సప్లిమెంట్స్ సేఫ్ అనిపించినా వాటిలోని కొన్ని పదార్థాలు లివర్‌కు టాక్సిక్ గా మారి ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. 

మందులు ఎక్కువగా వాడటం వల్ల లివర్ ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అయి శరీరంలో విషపదార్థాలు సరిగ్గా తొలగించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

లివర్ డ్యామేజ్ మొదట్లో కనిపించకపోయినా తరువాత అలసట వాంతులు జాండిస్ వంటి లక్షణాలు కనిపించి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది గుర్తించాలి.

పెయిన్‌కిల్లర్స్ ను తరచుగా తీసుకునే వారు లివర్ ఫంక్షన్ టెస్ట్స్ చేయించుకోవడం ద్వారా ముందుగా రాబోయే సమస్యలను గుర్తించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

మద్యం తో పాటు మందులు తీసుకోవడం లివర్ పై డబుల్ ప్రభావం చూపి మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అలవాట్లు మార్చాలి.

సప్లిమెంట్స్ కొనుగోలు చేసే ముందు వాటి క్వాలిటీ మరియు సర్టిఫికేషన్ చూసుకోవడం చాలా ముఖ్యం లేదంటే లివర్ సమస్యలు పెరుగుతాయి జాగ్రత్తగా ఎంపిక చేయాలి.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నేచురల్ ఫుడ్ తీసుకోవడం మరియు అవసరమైనప్పుడే మెడిసిన్ వాడటం  మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలు పెద్దలు అందరూ స్వయంగా మందులు తీసుకునే అలవాటు తగ్గించి డాక్టర్ సూచనతో మాత్రమే వాడటం ఆరోగ్యానికి మంచిది అవుతుంది గుర్తుంచుకోండి.

సప్లిమెంట్స్ ఎక్కువగా వాడటం శరీరానికి త్వరగా ఫలితాలు ఇవ్వకుండా తిరిగి లివర్ పై భారాన్ని పెంచి సమస్యలు పెంచుతుంది కాబట్టి కంట్రోలింగ్ ముఖ్యం.

లివర్ ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. కాబట్టి దానిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది చిన్న తప్పిదాలు కూడా పెద్ద సమస్యలకు కారణం అవుతాయి.