చలికాలంలో జలుబు, దగ్గు వచ్చినప్పుడు కారణం ఇదే కావచ్చు, కానీ చాలామందికి ఈ వైరస్ పేరు ఏమిటో కూడా తెలియదు
హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ సాధారణంగా పిల్లలు, వృద్ధులు, ఇమ్యూన్ సిస్టం వీక్ గా ఉన్నవారిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది.
ఈ వైరస్ ఎటాక్ అయిన వారికి జలుబు, ముక్కు కారటం, గొంతు నొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
అయితే చాలా సందర్భాల్లో ఇది సాధారణ జలుబులానే అనిపించి, ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండానే తగ్గిపోతుంది.
ఈ వైరస్ వల్ల కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతుగా అనిపించటం, వీజింగ్ లాంటి లక్షణాలు కూడా రావచ్చు.
ఈ వైరస్ గాలి ద్వారా, దగ్గు తుమ్ముల ద్వారా, ఇంకా వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండటం వల్ల సులభంగా వ్యాపిస్తుంది.
ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కి ప్రత్యేకమైన మెడిసిన్ లేదా టీకా లేదు, కానీ పూర్తిగా రెస్ట్ తీసుకోవటం, ఫ్లూయిడ్స్ తీసుకోవటం, జనరల్ చెకప్ సరిపోతుంది.
మిగితా వాళ్ళతో పోలిస్తే పిల్లలకి స్కూల్‌లలో, వృద్ధులకి ఆసుపత్రుల్లో ఈ వైరస్ త్వరగా సోకే అవకాశం ఉంటుంది.
చేతులు తరచుగా కడుక్కోవడం, మాస్క్ వాడటం, క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట ఉండకపోవటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే మీకు ప్రతీ వింటర్ సీజన్ లో ఈ జలుబు వస్తుంటే, మీరు ఈ వైరస్‌ను ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు.