భారతదేశంలో ఉన్న వాటర్ పొల్యూషన్ ఇప్పుడు మన ఇళ్ల వరకూ చేరింది, మనం తాగుతున్న గ్లాసులోనే  ప్రమాదం పొంచి ఉంది.

మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు నదులు, చెరువులను నెమ్మదిగా విషపూరితంగా మారుస్తున్నాయి.

కాలుష్య నీరు తాగడం వల్ల పిల్లల్లో డయేరియా, గ్రోత్ డిసార్డర్స్, పెద్దల్లో కిడ్నీ ప్రాబ్లెమ్స్ పెరుగుతున్నాయి.

ఈ సమస్య కారణంగా గ్రామాలు, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా బాధపడుతున్నాయి, అక్కడ మంచినీరు ఇప్పటికీ  దొరకటం కష్టమవుతుంది. 

కానీ దీనికో సొల్యూషన్ ఉంది, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, కఠిన నియంత్రణలు నీటి కాలుష్యాన్ని తగ్గించగలవు.

ఇళ్లలో ఫిల్టర్లు వాడటం, రెయిన్ వాటర్ స్టోరేజ్ వంటి చిన్న చర్యలు కుటుంబ ఆరోగ్యాన్ని భారీగా రక్షించగలవు.

రైతులు కెమికల్స్ తక్కువగా వాడితే భూగర్భ జలాలు కాపాడబడతాయి, దీంతో భవిష్యత్తు తరాల వారికి నీరు ఆదా అవుతుంది. 

ప్రశ్నించే ప్రజలు, నిరంతర ఒత్తిడి అనేది ఉంటే ప్రభుత్వాలు నీటి కాలుష్యంపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయి.

క్లీనింగ్ వాటర్ అంటే ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన పిల్లలు అంటే తక్కువ వైద్య ఖర్చులు, బలమైన సమాజం అన్న మాట. 

నిజానికి నీటి కాలుష్య సమస్య పెద్దదైనా పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, ఇప్పుడే మార్పు మొదలుపెడితే సరిపోతుంది.