విటమిన్ D మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా విటమిన్ D లోపం ఉన్నవారిలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రెస్పిరేటరీ ప్రాబ్లెమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
విటమిన్ D మనకి సన్ లైట్ ద్వారా నేచురల్ గా లభిస్తుంది. ఇది శరీరంలో ఇమ్యూన్ సెల్స్‌ను యాక్టివ్‌గా ఉంచుతుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ విటమిన్ డి యాక్టివిటీని పెంచుతాయి. రెస్పిరేటరీ వైరస్‌లు లంగ్స్ ని దెబ్బతీయకుండా అడ్డుకోవడంలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది.
పిల్లలు, వృద్ధులు విటమిన్ D లోపానికి ఎక్కువగా గురవుతారు, అందుకే వాళ్ళు త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు.
మన శరీరంలో సరైన స్థాయిలో విటమిన్ D ఉంటే జలుబు తీవ్రత, దగ్గు, ఇన్ఫెక్షన్ వ్యవధి వంటివి తగ్గే అవకాశాలు ఎక్కువ.
కోవిడ్ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చిన సమయంలో విటమిన్ D ప్రాముఖ్యతపై శాస్త్రవేత్తలు ఎక్కువగా పరిశోధనలు చేశారు.
నేచురల్ గా విటమిన్ D లభించనప్పుడు విటమిన్ D సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతో తీసుకుంటే రెస్పిరేటరీ హెల్త్ ని ఇంప్రూవ్ చేయవచ్చు.
గుడ్లు, చేపలు, పాలు వంటి ఆహారాల్లో విటమిన్ D ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
రోజూ కొద్దిసేపు సన్ లైట్ లో ఉండటం, సరైన ఆహారం తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ ని గడపటం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉండవచ్చు.