మీ శరీరంలో జరిగే మార్పులు
రోస్టెడ్ వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
హృదయానికి రక్షణ
రోజూ రోస్టెడ్ వెల్లుల్లి తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
బీపీ నియంత్రణ
వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కాంట్రోలో లో ఉంటుంది.
డయాబెటిస్‌కి ఉపశమనం
రోస్టెడ్ వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనిద్వారా షుగర్ తగ్గుతుంది.
జీర్ణక్రియకు మేలు
వేడి చేసిన వెల్లుల్లి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
బాడీ డిటాక్స్
వెల్లుల్లి లివర్ పనితీరును మెరుగుపరచి, టాక్సిన్లను శరీరం నుండి బయటకు పంపిస్తుంది. దీనివల్ల టోటల్ బాడీ డిటాక్స్ అవుతుంది.
ఇన్ఫెక్షన్ లకు అడ్డుకట్ట
వెల్లుల్లి బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.
చర్మ కాంతి పెరుగుతుంది
శరీరంలో టాక్సిన్లను తొలగించడం ద్వారా చర్మం సహజంగా మెరిసిపోతుంది. ఇంకా మచ్చలు, డార్క్ స్పాట్స్, మరియు ముడతలని కూడా తగ్గిస్తుంది.
మెదడుకి ఆరోగ్యం
వెల్లుల్లి న్యూరోప్రొటెక్టివ్ గుణాలు కలిగి ఉండి మెదడు కణాలను రక్షించి, మతిమరుపును తగ్గిస్తాయి.