కొబ్బరి పాల కాఫీ

కాఫీకి పాల బదులు కొబ్బరి పాలు కలుపుకుంటే మరోలెవల్ టేస్ట్ వస్తుంది. క్రీమి టెక్స్చర్‌తో పాటు లైట్ స్వీట్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది.

కొబ్బరి పాల టీ  

మీ ఉదయం కప్పు టీకి కొత్త ట్విస్ట్ కావాలనుకుంటే పాల బదులుగా కొబ్బరి పాలు వేసి ట్రై చేయండి. ఇది తేలికగా డైజెస్ట్ అవుతుంది, 

కొబ్బరి పాల స్మూతీ

మామిడి, అరటి, బెర్రీలు లాంటి ఫ్రూట్స్‌తో కొబ్బరి పాలు బ్లెండ్ చేస్తే ఎనర్జీతో నిండిన స్మూతీ సిద్ధం. ఇది సమ్మర్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. 

కొబ్బరి పాల లస్సీ 

లస్సీ అంటే సాధారణంగా పెరుగుతో చేస్తారు. కానీ కొబ్బరి పాలు వేసి ట్రై చేస్తే దానికి ఒక ప్రత్యేకమైన ట్రాపికల్ ఫ్లేవర్ వస్తుంది. 

కొబ్బరి పాల మిల్క్‌షేక్  

ఐస్‌క్రీమ్, డ్రైఫ్రూట్స్, చాక్లెట్ సిరప్ లాంటివి కలిపి కొబ్బరి పాలతో మిల్క్‌షేక్ చేస్తే గ్లాస్‌ఫుల్ క్రీమీనెస్ అందుతుంది. 

కొబ్బరి పాల మాచా లాట్టే  

గ్రీన్ టీ మాచా పొడిని కొబ్బరి పాలలో కలిపి తాగితే యాంటీఆక్సిడెంట్స్‌తో రిచ్ హెల్త్ డ్రింక్ తయారవుతుంది. 

కొబ్బరి పాల హాట్ చాక్లెట్  

చల్లని వాతావరణంలో హాట్ చాక్లెట్ తాగడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సాధారణ పాల బదులుగా కొబ్బరి పాలు వేసుకుంటే డ్రింక్ క్రీమి & రిచ్‌గా మారుతుంది.  

కొబ్బరి పాల ప్రోటీన్ షేక్

వర్కౌట్ తర్వాత బాడీకి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ పౌడర్‌ని కొబ్బరి పాలలో కలిపి తాగితే రికవరీ త్వరగా జరుగుతుంది, అలాగే ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది.

కొబ్బరి పాల పినాకోలడా  

ప్రపంచప్రసిద్ధ ట్రాపికల్ డ్రింక్ – అనాస జ్యూస్ + కొబ్బరి పాలు + ఐస్ కలిస్తే అద్భుతమైన రిఫ్రెషింగ్ టేస్ట్ వస్తుంది. వేసవిలో కూల్‌గా అనిపించడానికి పర్ఫెక్ట్.

కొబ్బరి పాల చియా సీడ్స్ డ్రింక్  

చియా సీడ్స్‌ని కొబ్బరి పాలలో నానబెట్టి, కొంచెం తేనె కలిపితే తేలికగా జీర్ణమయ్యే, పూటంతా ఫిల్లింగ్‌గా ఉంచే హెల్తీ డ్రింక్ సిద్ధం.