బరువు తగ్గిస్తుంది
గ్రీన్ ఆపిల్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది, కాబట్టి బరువు తగ్గుతారు.
రక్తంలో చక్కెర నియంత్రణ
దీనిలోని పాలిఫీనాల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతాయి. డయాబెటీస్ ఉన్న వారికి మంచి బెనిఫిట్.
హార్ట్ హెల్త్ కాపాడుతుంది
గ్రీన్ ఆపిల్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణక్రియ బాగుపరుస్తుంది
ఫైబర్ అధికంగా ఉండటంతో గ్రీన్ ఆపిల్ తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది.
చర్మ కాంతి పెంచుతుంది
గ్రీన్ ఆపిల్‌లో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, మచ్చలు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
గ్రీన్ ఆపిల్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ & విటమిన్స్ ఇమ్యూనిటీని బలపరుస్తాయి.
ఎముకలకు బలాన్నిస్తుంది
కాల్షియం, మ్యాగ్నీషియం, విటమిన్ K వలన ఎముకలు బలంగా మారతాయి, ఆస్టియోపొరోసిస్ ముప్పు తగ్గుతుంది
లివర్ క్లీన్సింగ్
గ్రీన్ ఆపిల్ లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. దీని ద్వారా టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.
మెదడు శక్తిని పెంచుతుంది
ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల మెమరీ పవర్ మరియు కాన్సంట్రేషన్ వంటివి పెరుగుతాయి.
కంటి ఆరోగ్యానికి మంచిది
విటమిన్ A & యాంటీఆక్సిడెంట్స్ వలన కంటి చూపు మెరుగుపడుతుంది, కంటి సమస్యలు తగ్గుతాయి.